తెలంగాణ

సిఎం కెసిఆర్‌కు పంటి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: కంటి ఆపరేషన్ కోసం దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంటికి రూట్ కెనాల్ చికిత్స చేయించుకుని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో గడిపిన కెసిఆర్ తన వ్యక్తిగత వైద్యుడి చేత కంటికి చికిత్స చేయించుకున్నారు. ఆయన కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీకి రావటం తెలిసిందే. అయితే కన్ను ఆపరేషన్ చేసే ముందు పంటికి చికిత్స చేయించుకోవలసి వచ్చింది. దీనితో కంటి ఆపరేషన్ వాయిదా వేసి పంటికి చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. పంటికి రూట్ కెనాల ట్రీట్‌మెంట్ చేయించుకున్న చంద్రశేఖరరావు కంటి ఆపరేషన్ కోసం పది, పదిహేను రోజుల తరువాత మరోసారి ఢిల్లీకి రావచ్చునని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న వారం రోజుల్లో ఒకటి, రెండు సార్లు తెలంగాణ అధికారులను మాత్రమే కలుసుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులు లేదా జాతీయ నాయకులను కలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. చంద్రశేఖరరావును కలుసుకునేందుకు టిఆర్‌ఎస్ ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులకు కూడా అనుమతి లభించలేదు. అయితే లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, సీనియర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌లు మాత్రమే ముఖ్యమంత్రిని తరచూ కలుసుకోగలిగారు. చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన కుమారుడు, ఐ.టి శాఖ మంత్రి కె.టి.రామారావు, లోక్‌సభ సభ్యురాలు, కూతురు కె.కవిత చంద్రశేఖరరావుతో కొంత సమయం గడిపారు. ఆయన పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినప్పుడు కవిత ఆయన వెంట వెళ్లటం గమనార్హం.