తెలంగాణ

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 15వ తేదీ నుండి నిర్వహించేందుకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఫస్టియర్, సాయంత్రం సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 23 నాటికి పరీక్షలు పూర్తవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 24 నుండి 28 వరకూ నిర్వహిస్తారు. ఎథిక్స్ పరీక్ష మే 29న, ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష మే 30న నిర్వహిస్తారు. ప్రతి సారీ ఫెయిలవుతున్న విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. ప్రతి ఏటా కంటే ఈసారి అడ్వాన్స్ పరీక్షల షెడ్యూలును వారం రోజులు ముందుకు జరిపామని అన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.