తెలంగాణ

ధర్నా చౌక్‌గా మార్చేద్దాం*

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌కు ఈ నెల 15న వెళ్ళేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే మొత్తం జంట నగరాలను ఎక్కడికక్కడ ధర్నా చౌక్‌గా మార్చేయాలని టి.జెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ పిలుపునిచ్చారు. ఇందిరాపా ర్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హిమాయత్‌నగర్‌లోని సిపిఐ కార్యాలయం (మఖ్దూం భవన్) ఆవరణలో వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు శనివారంతో 29వ రోజుకు చేరుకున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల సభ్యులు శనివారం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ధర్నా చౌక్‌ను ఎత్తి వేసిన వారే అనేక సార్లు ఆ ప్రాంతంలో దీక్షలో పాల్గొన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్ళకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రచయిత్రి సుజాత ప్రసంగిస్తూ ధర్నాలకు, నిరసనకు, ప్రభుత్వానికి సమస్యలు తెలియజేసేందుకు అనేక సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌లో లోగడ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారని గుర్తు చేశారు. కవి శివారెడ్డి ప్రసంగిస్తూ సచివాలయం ముందు ఉన్న ధర్నా చౌక్‌ను ఇందిరా పార్కు వద్దకు తరలించడమే మొదటి తప్పు అని అన్నారు. రైతు సంఘం నాయకుడు బండ చంద్రారెడ్డి, సామాజిక కార్యకర్తల ఎం. కృష్ణ, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సభ్యులు హనే్మష్, మల్లెపల్లి ఆదిరెడ్డి, డిజి నరసింహారావు, కె. గోవర్ధన్, రామలక్ష్మి, సైదులు, శాంతి, సరోజ, సంపూర్ణ, యాదమ్మ, ఇందిర, సుగుణమ్మ, కృష్ణ, సజయ, కవిత, సంపూర్ణ, జీవన్‌కుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

చిత్రం..రిలే నిరసన దీక్షలో పాల్గొన్న వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు