తెలంగాణ

టెక్నాలజీ సాయంతో అవినీతి నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోట్లాది రూపాయలు పనులు జరుగుతుంటాయి. అదే సమయంలో అవినీతి వ్యవహారాలు సైతం ఇదే స్థాయిలో జరుగుతున్నాయి.
అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టడానికి సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారకరామారావు నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలను నిరోధించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆన్‌లైన్ మానిటరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, క్షేత్ర స్థాయిలో వీటి పర్యవేక్షణ బాధ్యత ఇంజనీర్లపై ఉంటుంది. ఈ పనుల పర్యవేక్షణ, నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ పనుల్లో నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. సెంట్రల్ జోన్‌లో నాలాల పూడిక తీసివేత పనుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల పనె్నండు మంది సిబ్బంది అరెస్టయ్యారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఇంజనీరింగ్ పనులను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా అసెస్‌మెంట్ చేసే అన్‌లైన్ మానిటరింగ్ సిస్టంను రూపొందించారు. దీన్ని టీం అని పిలుస్తున్నారు. అక్రమాల నివారణ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు జిపిఎస్ ద్వారా మెజర్‌మెంట్ చేసి, గుత్తేదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తారు. దీని కోసం వెబ్ క్లౌడ్ సాంకేతిక విధానాన్ని ఉయోగించుకోనున్నారు. పని జరిగే ప్రదేశం నుంచే మొబైల్ యాప్ ద్వారా జరిగిన మొత్తం పని, క్వాలిటీ ప్రమాణాలు, చేసిన పని మొత్తం ఎప్పటికప్పుడు సాంకేతిక పద్ధతిలో నమోదు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ చేసే ప్రతి ఇంజనీరింగ్ పని, బిల్లులు రూపొందించడం, చెల్లించడం వరకు అన్నింటినీ నమోదు చేస్తారు. ఈ విధానం వల్ల వే బ్రిడ్జి రశీదులు తేవడం, క్వాలిటీ కంట్రోల్ నివేదికల కోసం ఇంజనీర్ల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండవని, కాంట్రాక్టర్లకు సులభతరం అవుతుందని గ్రేటర్ అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా ఉప్పల్ సర్కిల్‌లో అమలు చేసి చూస్తే మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినందున అన్ని సర్కిళ్లలో ఈ విధానం అమలు చేయనున్నట్టు జిహెచ్‌ఎంసి కమీషనర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రవేశపెడుతున్న ఈ ఆన్‌లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసేందుకు టెండర్లు పిలువనున్నామని కమీషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ పనులను ఆల్‌లైన్ విధానంలో పర్యవేక్షించే పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి మెట్రో పాలిటన్ కార్పొరేషన్‌గా జిహెచ్‌ఎంసి నిలిచిందని చెప్పారు.