తెలంగాణ

అప్పుల పాల్జేస్తున్న పెళ్లిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: పేదలు, మధ్య తరగతికి చెందిన కుటుంబాల్లో మగపిల్లవాడి పెళ్లయినా, ఆడపిల్ల పెళ్లయినా అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలు ఉండగా, వీటిలో 60శాతం కుటుంబాలు పెళ్లిళ్ల కారణంగా ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నాయి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ముందు డాంబికం ప్రదర్శించాలన్న ఉత్సాహంతోనే అనేక కుటుంబాలు వివాహాల కోసం అప్పులు చేస్తున్నాయి. సాధారణంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే వెయ్యి రూపాయలు మించి ఖర్చు కాదు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తుండటంతో అవి పేద కుటుంబాలకు కొంత ఊరట ఇస్తున్నాయి.
గతంలో గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగితే ఇళ్ల ముందు మర్రి తదితర చెట్ల ఆకులు, కొమ్మలతో పందిళ్లు వేసేవారు. బంధువులు, స్నేహితులు సదరు కుటుంబ పెద్దకు పెళ్లి నిర్వహణలో చేదోడువాదోడుగా నిలిచేవారు. ఇళ్ల ఆవరణల్లోనే వంటలు చేయించడంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మ్యారేజ్ హాల్స్, హోటళ్లలో పెళ్లిళ్లు జరుపుతున్నారు. వంట చేయించేందుకు ప్రాక్టికల్‌గా సమస్యలు తలెత్తుతున్నాయని క్యాటరింగ్‌కు ఇస్తున్నారు. క్యాటరింగ్‌లో ఒక్కో ప్లేటుకు 150రూపాయల నుండి 800రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన భోజనాలకు రెండు లక్షలు, బట్టలకు రెండు లక్షలు, మ్యారేజ్ హాల్‌కు లక్ష నుండి రెండు లక్షలు, డెకోరేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గిఫ్టులు, పెళ్లికార్డులు, రవాణా తదితర ఖర్చులకు మరో నాలుగు నుండి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. మగపిల్లవాడి పెళ్లయినా, ఆడపిల్ల పెళ్లయినా కాస్త అటుఇటుగా ఇదే ఖర్చు అవుతోంది. ఆడపిల్ల తల్లిదండ్రులకు వరకట్నం అదనపు భారంగా ఉంటుంది. గత రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పెళ్లిళ్లు జరిగాయని అనధికారిక సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల కుటుంబాలు ఈ విధమైన అప్పుల్లో కూరుకుపోయాయి. బ్యాంకులు పెళ్లిళ్లకు అప్పు ఇవ్వవు కనుక ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుండి, స్నేహితుల నుండి అప్పు తెచ్చి వివాహాలు చేస్తున్నారు. ఇది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది.