తెలంగాణ

రైతుల దుస్థితి సిఎంకు తెలియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతైతే కృషి చేశారో అంతే స్థాయిలో తెరాస ప్రభుత్వం కళ్లు తెరిపించేలా రైతుల దుస్థితిని తెలియజేస్తూ పాటలు రాయాలని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి కవులు, కళాకారులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రైతులు ఏ దుస్థితిలో ఉన్నారో సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా పాటలు రాసి రైతులకు సహాయపడాలని కోరారు. ఆదివారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక జగిత్యాలకు చెందిన రైతు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తాను తీసుకువచ్చిన పసుపు రాశిపైనే తనువు చాలిస్తే, రాథోడ్ అనే ఆదిలాబాద్‌కు చెందిన రైతు ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి చనిపోయిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో ఉదంతాలను కవులు, కళాకారులు గ్రహించి పాటలు రాసి, పాడి ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నం చేయాలని కోరారు. బషీర్‌బాగ్ కాల్పుల ఉదంతాన్ని పదే పదే చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగిన సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటి టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మంత్రిగా లేరా..? అని ప్రశ్నించారు. రైతు సమాఖ్యలను ప్రభుత్వం నియమిస్తుందని నేతలు చెబుతున్నారని, హాస్పిటళ్లలో పింక్ దుప్పట్ల మాదిరిగా పింక్ నాయకులను నియమిస్తారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నెల 24న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే టిడిపి మహానాడులో, విశాఖలో జరిగే జాతీయ మహానాడులో తమ వ్యవసాయ విధానం గురించి ప్రస్ఫుటంగా చెబుతామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.