తెలంగాణ

ప్రాజెక్టుల దగ్గరే బస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14:్భ సేకరణకు సంబంధించి అడ్డంకులు అన్నీ తీరిపోయాయి, నిధుల కొరత లేదు, ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే విధంగా పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాళేశ్వరం, పాలమూరు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రతి ప్రాజెక్టును సందర్శించాలని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పురోగతిని ఏ రోజుకు ఆ రోజు తెలుసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఆ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వలసలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఆ జిల్లాలోని పలు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తోంది. దీనికి తోడు మిషన్ భగీరథ వల్ల చెరువుల పూడిక తీశారు. గత రెండేళ్లు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం తక్కువగానే కురిసింది. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉందని ఈ రెండు జిల్లాల్లో చెరువులు సైతం నీటితో కలకలలాడుతాయని అధికారులు భావిస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రతి పదిహేను రోజులకు మూడు రోజుల పాటు పాలమూరులోనే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మకాం వేస్తారు. నెలకు ఆరురోజుల పాటు జిల్లాలో ఉంటారు. పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేంత వరకు పదిహేను రోజులకు మూడు రోజుల చొప్పున జిల్లాలో ఉంటారు. ప్రతి రోజు అధికారులతో వివరాలు తెలుసుకుంటారు. వచ్చే ఖరీఫ్ నాటికి లక్ష 50వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నెట్టెంపాడును సిద్ధం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. నవంబర్ నాటికి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇంకా 11వందల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి సమస్యలు తీరిపోయినందున స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. భీమా నుంచి రెండు లక్షలు, నెట్టెంపాడు నుంచి రెండు లక్షలు, కోయిల్ సాగర్ నుంచి 50వేల ఎకరాలు నీటిని ఈ ఖరీఫ్‌లోనే అందించే విధంగా పనులు చేస్తున్నారు.