తెలంగాణ

ఎస్సారెస్పీ ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 14: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం ఆయకట్టు రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కాకతీయ కాలువను ఆధునీకరించి అరమీటర్ లోతు తవ్వితే ఎస్సారెస్పీ మొదటి దశలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 9.30 లక్షల ఎకరాలతో పాటు రెండోదశలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని 3 లక్షల 97 వేల ఎకరాలకు గోదావరి సాగునీటి సరఫరా సక్రమంగా సాగుతుందన్న నిపుణుల నివేదిక మేరకు కాలువ మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కాకతీయ ప్రధాన కాలువ తొలి దశ నిర్మాణం సరిగా లేకపోవడంతో రెండో దశలోని ప్రస్తుత సూర్యాపేట జిల్లా పరిధిలోని 2 లక్షల 13,175 ఎకరాలకు, ఖమ్మం పరిధిలోని 75,262 ఎకరాలతో పాటు జనగామ, వరంగల్ రూరల్, మహబూబ్‌బాద్ జిల్లాల్లో పరిధిలోని మొత్తం 3 లక్షల 97 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా సమస్యగా తయారైంది. రెండో దశ కాకతీయ కాలువ సూర్యాపేట జిల్లాలో 284 నుండి 346 వరకు నిర్మితమైంది. డిస్టిబ్యూటరీలు, మైనర్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.
ఆధునీకరణతో ఆయకట్టుకు భరోసా
ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువను 9,300 క్యూసెక్కుల నీటిని వదిలేందుకు వీలుగా కాకతీయ కాలువను డిజైన్ చేశారు. తదుపరి 8,500కు తగ్గించినప్పటికీ కాలువలో 6,500 క్యూసెక్కుల నీటిని వదిలినా కూడా కాలువ సామర్ధ్యం చాలక కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కాలువ చివరి ఆయకట్టులో 2.50 లక్షల ఎకరాల మేరకు సాగునీరందడం లేదు. దీంతో రైతులు బావులు, బోర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి దుస్థితే రెండో దశ ఆయకట్టు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతులకు కూడా ఎదురవుతుంది. గత రబీలో 6,500 క్యూసెక్కుల నీరు వదిలితే తొలి దశ కాకతీయ కాలువలో మల్యాల వద్ద కాలువకు గండిపడింది. కాకతీయ కాలువను ఆధునీకరించాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ల బృందంతో కమిటీ వేసింది. ప్రస్తుతమున్న కాలువ బెడ్ అడుగు భాగం అరకిలోమీటర్ లోతు తీసి ఆధునీకరణ పనులు చేపడితే పూర్తి స్థాయిలో నిర్దేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కాకతీయ కాలువ ఆధునీకరణకు ఆదేశాలిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండడం తో కాలువ ఆయకట్టు రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తాయి. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో 2,400 కోట్లు వెచ్చించి కాకతీయ కాలువకు లైనింగ్ వేయగా, కాంగ్రెస్ హయాంలో 270 కోట్లు వెచ్చిం చి లైనింగ్, ఇతర మరమ్మతులు జరిపించారు. అయితే పనులు నాసిరకంగా సాగడంతో మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటయ్యాయి. కాలువలో పిచ్చిమొక్కలు పెరగడం, గండ్లు పడటం జరిగింది. నీటి ప్రవాహ సామర్ధ్యం కాస్తా 9,500 క్యూసెక్కుల నుండి 5,500 క్యూసెక్కులకే పరిమితమైంది. మొదటి దశలో ఉన్న కరీంనగర్, వరంగల్ జిల్లాల కు నీరందకపోవడంతో రెండో దశలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాకు సాగునీరు అందడం కష్టతరమైంది. ప్రభుత్వం కాకతీయ కాలువ ఆధునీకరణ చేపడితే రెండో దశలోని సూర్యాపేట జిల్లాకు కూ డా సక్రమంగా గోదావరి జలాలు అందనున్నాయన్న ఆశలు రైతాంగంలో నెలకొన్నాయి.

చిత్రం..శ్రీరాంసాగర్ కాకతీయ ప్రధాన కాలువ