తెలంగాణ

అన్ని గ్రామాలకు రోడ్లు, బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా అన్ని గ్రామాలకు రోడ్డుసౌకర్యం కల్పిస్తూ బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అక్రమ రవాణాపై కొరడా ఝళిపిస్తామని, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాససన సభలో రవాణా పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు జలగం వెంకట్రావు, రేవంత్ రెడ్డి, రాజయ్య, రవీంద్రకుమార్, ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ తెలంగాణలోని 15 చెక్‌పోస్టుల వద్ద, హైవేలపై సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, కమర్షియల్ ట్యాక్స్ శాఖ సహకారంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఆర్టీసిని నష్టాల్లో కాకుండా లాభాల బాటలో నడిపిస్తామన్నారు. 40 కోట్లతో వెయ్యి బస్సులను కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు నడిపిస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లలో రూ. 30 కోట్లతో వౌలిక వసతులు కల్పించనున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా నగరంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మినీ బస్సులు నడుపుతామని, బస్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.