తెలంగాణ

ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహించే జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టాలని ఎబివిపి కార్యకర్తలు సోమవారం ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించారు. దాంతో బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారని, ఇంత వరకూ అందుకు సంబంధించి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి గురై అనేకమంది విద్యార్ధులు తనువు చాలించారని, వారి ఆగడాలను ఆపాలంటే ఈ విద్యాసంవత్సరం నుండే ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని అన్నారు. నగరంలో ఎక్కడా హాస్టళ్లకు అనుమతి లేదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పారని, అయినా కార్పొరేట్ కాలేజీలు పబ్లిగ్గా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని విద్యార్థులు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నా ఎలాంటి వౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నగర కార్యదర్శి దిలీప్, కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు రాఘవేందర్, ఎల్లస్వామి, శ్రీహరి, మషేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన చేస్తున్న ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు