తెలంగాణ

వాన్నాక్రై బ్లాక్ మెయిల్ వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ‘‘వాన్నాక్రై ఒక బ్లాక్ మెయిల్ వైరస్, దీని ప్రభావం ప్రపంచంలో అనేక దేశాలపై పడిందని, అయితే తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ముందు జాగ్రత్త చర్యలు సూచించటంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని రాష్ట్ర ఐటి డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో40వేల కంప్యూటర్లలోకి ఈ వైరస్ చొరబడినట్టు ఆయన వివరించారు. తెలంగాణలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఈ వైరస్ వచ్చినట్టు రిపోర్ట్ కాలేదు. పర్సనల్ కంప్యూటర్‌లకు సంబంధించి సమాచారం లేదు’’ అని తెలంగాణ ఐటి డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఆంధ్రభూమికి తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నాక్రై వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ సమాచారం పంపినట్టు తెలిపారు. దేశ భద్రతకు సైన్యం, పౌరుల భద్రతకు పోలీసులు ఎలా అవసరమో ఇప్పుడు కంప్యూటర్లలోని సమాచార భద్రతకు సైబర్ సెక్యూరిటీ కూడా అంతే అవసరమని, దేశంలో సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకు వచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ నివారణ కోసం సైబర్ సెక్యూరిటీలో నిపుణత కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
పైరసీ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించడం అంటే పైరసీకి ఆహ్వానం పలికినట్టేనని, ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విండోస్ వంటివి పైరసీ సాఫ్ట్‌వేర్ ఉపయోగించవద్దని సూచించారు. విండోస్ ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తే, పదిహేను రోజులకు ఒకసారి వైరస్‌లను తొలగించే సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్ ఆటో మెటిక్‌గా అప్‌లోడ్ చేసుకుంటుంది. పైరసీలో ఈ అవకాశం ఉండదని అన్నారు.
ఇది ఓ బ్లాక్‌మెయిల్ వైరస్
వాన్నాక్రై వైరస్ బ్యాంకుల ఖాతాలోకి చొరబడితే మనకు సంబంధం లేకుండా మన డబ్బును స్వాహా చేసే అవకాశం ఉంటుందని దిలీప్ తెలిపారు. వైరస్ ద్వారా కంప్యూటర్‌ను తమ అదుపులోకి తీసుకుని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టుగానే వీళ్లు వైరస్ ద్వారా అలాంటి డిమాండ్లు చేస్తున్నారని ఆయన వివరించారు. చైనా వంటి దేశాల్లో ఈ హ్యాకింగ్ ఒక వృత్తిగా మారిపోయిందన్నారు. నమ్మకమైన వ్యక్తుల నుంచి వచ్చిన మెయిల్ అటాచ్ మెంట్స్ మాత్రమే ఓపెన్ చేయాలని. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా పెన్‌డ్రైవ్, డిస్క్‌లను వాడవద్దని కొన్ని అనుమానాస్పద వెబ్‌సైట్ల జోలికి వెళ్లవదని దిలిప్ హెచ్చరించారు.
కాగా తెలంగాణ సచివాలయంలో ఇంటర్‌నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. వైరస్ చొప్పించే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా నిలిపివేసినట్టు తెలుస్తోంది.