తెలంగాణ

కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 16: గ్రామాల అభివృద్ధి పేద వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ తప్పుడు ప్రచారానికి పూనుకుంటోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం లో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తోందన్నారు. మోదీ దేశ సమైక్యత, సమగ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమర్ధవంతమైన పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ తమ నిధులుగా ప్రచారం సాగిస్తుందని విమర్శించారు. కేంద్రం సహకరించడంలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2019 నాటికి మిషన్ తెలంగాణగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. నల్లగొండలో తెలంగాణలోని 31 జిల్లాల పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పార్టీ పటిష్టతపై చర్చ జరుగుతుందని, ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు.