తెలంగాణ

ఎమ్మెల్యే రోజాపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యురాలిగా గౌరవప్రదమైన హోదాలో కొనసాగుతోన్న రోజా ఓ టివి ఛానెల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో మహిళలను కించపర్చేవిధంగా అసంబద్ధ పదాలు వాడుతున్నారంటూ హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్‌రావు మంగళవారం ఫిర్యాదు చేశారు. జబర్దస్త్, పటాష్‌లో కార్యక్రమంలో అశ్లీల ప్రవర్తనతో మహిళలను కించపరుస్తాన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్స్‌లో అనైతిక దృశ్యాలు, అసంబద్ధ పదాలు వాడుతున్నారని, ఈ విషయంపై టివి యాజమాన్యం కానీ, ప్రోగ్రామ్ డైరెక్టర్ కానీ సెన్సార్ చేయడం లేదని, తక్షణమే నటుడు నాగబాబు, ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకోవాలని దివాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడాల్సిన కార్యక్రమాలను చూపించకుండా చెత్త విషయాలను చూపి యువతను పెడదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.