తెలంగాణ

కొత్త పార్టీల వేటలో పాతకాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: గతంలో మావోయిస్టులుగా పని చేసిన వారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కొందరు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిలో ఒకరి మాట మరొకరు వినే పరిస్థితి లేదు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్న నాయకులు అందరూ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీకి కోదండరామ్ ఆశీస్సులు ఉన్నాయని ప్రకటిస్తున్నా, కోదండరామ్ ఈ కొత్త పార్టీల ఏర్పాటు నేతలకు దూరంగా ఉంటున్నారు. వీరి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
పార్టీ ఆవిర్భావ సమయంలో టిఆర్‌ఎస్‌లో కీలక నేతగా, ప్రధాన కార్యదర్శిగా ఉండి, బయటకు వెళ్లి సొంతంగా ఉద్యమ సంస్థ పార్టీ ఏర్పాటు చేసిన గాదె ఇన్నయ్య ఒకటిన్నర దశాబ్దాల తరువాత మళ్లీ రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టిఆర్‌ఎస్‌లో పని చేసిన చెరుకు సుధాకర్‌కు గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. చెరుకు సుధాకర్ భార్య బిజెపి తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు చెరుకు సుధాకర్ సైతం ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గాయకులు గద్దర్, విమలక్క మరి కొందరు కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత గద్దర్, విమలక్క బృందాలు ఎవరి లక్ష్యాల మేరకు వాళ్లు పని చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో గద్దర్‌తో పోటీ చేయించేందుకు సిపిఎం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే టిఆర్‌ఎస్ పోటీలో ఉంటే తాను పోటీ చేయనని ఏకగ్రీవంగా అయితే పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. టిఆర్‌ఎస్ పోటీలో ఉండడంతో గద్దర్ పోటీ చేయలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ గద్దర్ రాజకీయ పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఉద్యమ శక్తులన్నీ ఏకమై గద్దర్ నాయకత్వంలో పని చేయాలి అనేది కొందరి ప్రయత్నం.
ఒకప్పుడు మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న పలువురు నాయకులు ఇప్పుడు ఫేస్‌బుక్‌లోనే రాజకీయ పార్టీల ఏర్పాటు గురించి ప్రకటనలు చేస్తుండడం విశేషం. ఒక నాయకుడు ఫేస్‌బుక్‌లోనే రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తూ, కొందరు నేతల పేర్లను ప్రకటిస్తే, మరొకరు ఆ పార్టీలో ఎవరూ చేరడం లేదని ఖండిస్తున్నారు. ఫేస్‌బుక్‌లోనే పార్టీల ఏర్పాటు ప్రకటనలు, ఖండనలు సాగుతున్నాయి. టిడిపి నుంచి అసెంబ్లీకి ఎన్నికైనా ఆర్ కృష్ణయ్య పార్టీకి దూరంగానే ఉన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని బిసిలు తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని కృష్ణయ్య అనేక సార్లు ప్రకటించారు. మంద కృష్ణ మాదిగ సొంత పార్టీని ప్రకటించారు అయితే వర్గీకరణ అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.