రాష్ట్రీయం

కొండంతా భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 25: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. గురువారం కొండపై ఎటు చూసినా శ్రీవారి భక్తులతో నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు 12 గంటలు, కాలినడకన తిరుమలకు చేరుకుని దివ్యదర్శనానికి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాగా శ్రీవారికి భక్తులు హండీలో సమర్పించిన కానుకలు ద్వారా రూ. 2.44 కోట్లు ఆదాయం లభించింది. క్యూలైన్లు నిండిపోయి వెలుపల కిలోమీటర్లు మేర భక్తులు బారులు తీరి ఉన్నారు. తిరుమల జె ఇ ఓ శ్రీనివాస రాజు వైకుంఠం కాంప్లెక్స్‌లోను, వెలుపల క్యూలైన్లోలో ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. కాగా రద్దీ పెరగడంతో ప్రోటోకాల్ వి ఐ పిలను మినహాయించి సిఫార్సు ఉత్తరాలకు టిటిడి అధికారులు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో కూడా రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో వేసవికాలం పూర్తయ్యేంత వరకు శుక్ర, శని, ఆదివారాల్లో సాధారణ వి ఐ పి బ్రేక్ దర్శనాలను రద్దు చేసే నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
కాగా గురువారం రద్దీ పెరగడంతో గదులు దొరకక పోవడంతో ఉద్యానవనాలు, పేవ్‌మెంట్లు, శ్రీవారి ఆలయం ముందు బాగాన నిద్రిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో టాక్సీలు భక్తుల నుంచి అధికమొత్తంలో చార్జీలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో కల్యాణకట్ట క్యూలైన్, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సివస్తోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాలతో జె ఇ ఓ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వేసవి తాపానే్న కాకుండా, ఆకలి బాధలు తెలియకుండా చల్లటి నీళ్ళు, పిల్లలకు పాలు, పెద్దలకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. మరి కొద్ది రోజులు రద్దీ ఇలాగే కొనసాగుతుందని టిటిడి బావిస్తున్న నేపథ్యంలో ఇ ఓ

వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ చేరుకుంటున్న భక్తులు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో క్యూలైన్లుఅధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు.