రాష్ట్రీయం

జిఎస్టీకి వ్యతిరేకంగా హోటళ్లు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: జిఎస్టీ చట్టంలో అధిక మొత్తాల్లో విధించిన పన్నులకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల హోటళ్ల యజమానుల సంఘం పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రంలోని హోటళ్లన్నీ మూసివేశారు. ఇదేసమయంలో ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించాలనే డిమాండ్‌పై జాతీయ కమిటీ పిలుపుమేరకు ఎపి రిటైల్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మందుల దుకాణాలన్నీ మూతపడ్డాయి. హోటల్ రంగంపై ఇప్పటివరకు 5శాతం పన్ను ఉండగా జిఎస్టీ చట్టంలో నాన్ ఎసి రెస్టారెంట్లకు 12 శాతం, ఎసి రెస్టారెంట్లకు 18శాతానికి పెంచారని నిరసన తెలిపారు. ఇప్పటికే హోటల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి నేటివరకు వ్యాపారాలు సరిగాలేవని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తవరపు శ్రీనివాసబాబు అన్నారు. సరైన అవగాహన లేక ఏదైనా పొరపాటు జరిగితే అధికారుల నుంచి వేధింపులు, లేదా భారీ జరిమానాలు, జైలుశిక్షలకు గురికావాల్సి వస్తుందన్నారు. పైగా వంటల్లో వాడే కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం, పప్పులు, చక్కెర, మాంసాహారం, గుడ్లు వంటి సామగ్రికి ఈ చట్టంలో పన్ను ముదర ఉండదని, దీనివల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుందన్నారు.
ఇక, ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాల వల్ల ప్రత్యక్షంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడడమే కాకుండా పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను నష్టంతో పాటు ఈ రంగంపై ఆధారపడ్డ 40లక్షల కుటుంబాలు ఆదాయం కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం ఉందని రిటైల్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ విజయవాడ ప్రధాన కార్యదర్శి టి వెంకటేశ్వరరావు అన్నారు. ఈవిషయంలో గతంలో రెండుసార్లు జాతీయస్థాయిలో బంద్ నిర్వహించగా కేంద్రం స్పందించి ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిషేధిస్తూ జివో విడుదల చేసినా ఏ రాష్ట్రం కూడా నేటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు.
chitram...
బోసిపోయన ఓ హోటల్