తెలంగాణ

12 నుంచి 119 బిసి గురుకుల పాఠశాలలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో 119 బిసి గురుకుల పాఠశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతాయని, వీటివల్ల 41,863 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. పూలే బిసి గురుకుల పాఠశాలలను 12న లాంఛనంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. పాఠశాలల ప్రారంభోత్సవంపై మంత్రి జోగు రామన్న 31 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చూడాలని కలెక్టర్లను కోరారు. 119 గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల నిర్మాణానికి ఒక్కోచోట 10 ఎకరాల భూమి సేకరించామని, ఆ భవనాల నిర్మాణాలు పూర్తయ్యేవరకు అన్ని సౌకర్యాలతో అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2017-18 విద్యా సంవత్సరానికి ఐదు, ఆరవ తరగతులతో ప్రారంభించే బిసి గురుకులాల్లో 41,863 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, వచ్చే నాలుగేళ్లలో ఇంటర్ స్థాయికి ఈ గురుకులాలు అప్‌గ్రేడ్ చేయనున్నట్టు చెప్పారు.