తెలంగాణ

20 మంది కల్తీ వ్యాపారుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్‌లో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాలకు చెందిన 20 మంది వ్యాపారులు అల్లం, వెల్లుల్లి, తేనె, నెయ్యి, నూనె కల్తీ చేసి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు సౌత్‌జోన్ పోలీసులు, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించి మంగళవారం వారిని అరెస్టు చేశారు. వారినుంచి 48 ఆక్సిటోసిన్ డ్రగ్ ఇంజెక్షన్లు, 16 సిరంజీలతోపాటు 15.60 క్వింటాళ్ల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, 60 బాటిళ్ల తేనె, 30కిలోల సోంపు, 96 వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, టప్పాచబుత్ర, కుల్సుంపుర, గోల్కొండ, మలక్‌పేట, షాలిబండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్, సౌత్‌జోన్ పోలీసులు ఏకకాలంలో 15 డైరీ ఫారంలపై దాడులు నిర్వహించారు. పశువులకు పాలు ఎక్కువ ఇవ్వాలని ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను సరఫరా చేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు. చాదర్‌ఘాట్‌లోని రాయల్ ట్రేడర్స్, మహబూబ్ మెన్షన్, ఫలక్‌నుమా, ఫైవ్ స్టార్ ట్రేడర్స్, ఉమర్ అండ్ సన్స్‌కు చెందిన మూడు స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 15.60 క్వింటాళ్ల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హుస్సేని ఆలంలోని సంజీవని హానీ మిక్స్‌డ్ అండ్ డ్రై ఫ్రూట్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్న నరుూమొద్దీన్‌ను అరెస్టు చేసి 60 బాటిళ్ల కల్తీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కెన్వీ, రాయల్ మినరల్ వాటర్ విక్రయిస్తున్న సలాం బిన్ నాసర్ ఉల్ నఖీబ్ అనే వ్యాపారిని అరెస్టు చేసి అతని వద్దనుంచి ఎనిమిది కార్టూన్ (12)లను స్వాధీనం చేసుకున్నారు. భవానీనగర్, చుడీబజార్, షహినాయత్ గంజ్‌లలో నకిలీ సోంపు తయారు చేస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించి 30కిలోల సోంపును స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ కమిషనన్ లింబారెడ్డి తెలిపారు.