తెలంగాణ

కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే ఎఎన్‌ఎంలకు జివో 14 ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలని, అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. గురువారం మలక్‌పేట ఆసుపత్రిలో జరిగిన యూనియన్ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి అధ్యక్షత వహించారు. 31 జిల్లాల్లో యూనియన్ సభ్వత్వ నమోదు చేపట్టి జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీని నియమించాలని సాయిరెడ్డి అన్నారు.