తెలంగాణ

మరో నలుగురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, జఫర్‌గడ్, చిట్యాల, అమ్రాబాద్, డిసెంబర్ 15: అప్పుల బాధలు అన్న దాతల ఉసురు తీస్తూనే ఉన్నాయ. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మం గళవారం నలుగురు రైతులు ఆత్మహ త్య చేసుకొన్నారు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలపరిధిలోని ధర్మా పురం గ్రామపంచాయితీ ఆవాస గ్రామం రత్యాతండాలో కౌలు రైతు భూక్య సోమ్లా (45) 20 కుంటల భూ మితో పాటు అదే గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగుచేస్తున్నాడు. పంట దిగుబ డి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక వ్యవసాయపొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అంబాలి ఫిర్యా దుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జానయ్య తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నా రు. వరంగల్ జిల్లా జఫర్‌గడ్ మండ లంలోని ఒగ్లాపూర్ గ్రామానికి చెంది న రామగిరి రవీందర్ (40) క్రిమి సంహారక మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. రెండు సంవత్సరాల నుండి వ్యవసాయంలో ఆశించినంత పంట దిగుబడి రాక తెచ్చిన అప్పులు ఎక్కువవడంతో ఆందోళనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహార క మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డగా చికిత్స పొందుతూ ఎంజిఎంలో మృతి చెందినట్లు పోలీసులు, గ్రామ స్థులు తెలిపారు. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి 3లక్షల 50వేల వరకు అప్పు చేసి సేద్యం చేస్తున్నాడని ఈ క్రమంలో పంట దిగుబడి రాక తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామ స్థులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదే జిల్లా చిట్యాల మండలం అంకు షాపూర్ శివారు సోమన్‌పల్లి గ్రామాని కి చెందిన బండి యోగానందం (55) తన రెండు ఎకరాల భూమిలో పత్తి, మిర్చి పంటలను సాగు చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడు లు రాకపోవడంతో రూ.6లక్షల మేరకు అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీరే దారి లేక మనస్తాపానికి గురైన యోగానందం మంగళవారం ఉదయం పంట చేనులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన బంధువులు అతడిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపా రు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబా ద్ మండల పరిధిలోని కోడొనిపల్లి గ్రా మానికి చెందిన ఎనుబోతుల పాప య్య (39) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఉన్న రెండు ఎకరాల వ్యవసాయపొలంతోపాటు మ రో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, కంది పంటలను వేయగా, వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోవడంతో ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు భూక్య సోమ్లా

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..
ఆగిన రైతు గుండె
భీమిని, డిసెంబర్ 15: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం కనె్నపెల్లి గ్రామానికి చెందిన మారినేని మల్లయ్య (54) తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిర జలప్రభ పథకం కింద మంజూరైన బోరు బావికి విద్యుత్ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో గత రెండు సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్నారు. ఈ సంవత్సరమైనా కనెక్షన్ ఇస్తారనే ఆశతో వరి పంటను సాగు చేశాడు. వరి పంటకు నీరందక పూర్తిగా ఎండిపోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో తనలో తానే కుమిలిపోతుండేవాడని, ఇదే క్రమంలో సోమవారం విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రజాఫిర్యాదుల విభాగంలో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చి దిగులుపడుతూ గడిపాడని, అదే దిగులుతో మంగళవారం మధ్యాహ్నం కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడని.. వైద్య సౌకర్యం అందేలోపే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.