తెలంగాణ

అపోలో మెడకల్ కాలేజీ ఎంబిబిఎస్ కోర్సుకు ఎంసిఐ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: అపోలో వైద్య సంస్థ ఏర్పాటు చేసిన అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ అండ్ రీసెర్చ్‌లో ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతించింది. విజయవాడ ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గుర్తించిన ఈ మెడికల్ కాలేజీలో రానున్న ఐదేళ్లలో ప్రతి ఏటా 100 మంది విద్యార్థులు ఎంబిబిఎస్‌లో చేరేందుకు ఎంసిఐ అనుమతించిందని అపోలో వైద్య సంస్థ తెలిపింది. గత నెల 31న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేసింది.