తెలంగాణ

మీ పిల్లలను హాస్టల్లలో చేర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: బిసి, ఎస్‌సి, ఎస్‌టి వసతి గృహా ల్లో 3 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలను చేర్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత భోజన, బోధన వంటి సౌకర్యాలు పొందాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పుస్తకాలు, నాలుగు జతల టెరికోట్ డ్రెస్‌లు ఇస్తారని ఆయన తెలిపారు. వసతి గృహాల్లో పిల్లలను చేర్పించేందుకు బిసి సంఘాలు, దళిత సంఘాలు, యువజన సంఘాలు ప్రచారం చేయాలని ఆయన కోరారు.