రాష్ట్రీయం

గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణలో గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు సోమవారం నాడు స్టే విధించింది. మూడు వారాల వరకూ నియామక ప్రక్రియ చేపట్టవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్‌నర్‌తో దిద్దిన జవాబుపత్రాలను పరిగణనలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ విచారణ చేపట్టింది. గ్రూప్-2 నియామక ప్రక్రియపై గత కొద్ది కాలంగా వివాదాలు చెలరేగుతున్న విషయం విదితమే. జవాబు పత్రాలపై వైట్‌నర్‌తో దిద్దిన జవాబుపత్రాలను పరిగణనలోకి తీసుకున్నారంటూ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన చేపట్టారు. కొంత మంది హైకోర్టును సైతం ఆశ్రయించారు. సోమవారం నాడు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మూడు వారాల పాటు గ్రూప్-2 నియామక ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 1032 పోస్టుల భర్తీకి గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా దాదాపు 5.65 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవలె ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున మూడు వేల మందికిపైగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచింది. వారందరి సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియను స్టాన్లీ కాలేజీలో ప్రారంభించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో సర్ట్ఫికెట్ల పరిశీలనను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ప్రకటించారు.