తెలంగాణ

విద్యారంగంతో టి.సర్కార్ చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: పాఠశాల, ఉన్నత విద్యను సంస్కరిస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోగా, విద్యారంగంతో చెలగాటం ఆడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉచిత విద్యా విధానం ప్రారంభిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఆ విధానం ఏమిటో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు ఎ నర్సిరెడ్డి, చావ రవి, మాణిక్యరెడ్డి తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యారంగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఆహ్వానించదగిందే అయితే అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఆశిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా సాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించి, ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు విశ్వాసం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యకు ఉన్న బడులను, విద్యాసంస్థలను పటిష్ఠం చేస్తే సరిపోతుందని అన్నారు. వర్శిటీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి పిజి స్థాయి విద్యను మెరుగుపరచాలని, నియోజకవర్గానికి ఒక వృత్తివిద్యా కాంప్లెక్స్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించి అందులో ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, తదితర కోర్సులను మొదలుపెట్టాలని చెప్పారు. పిల్లల సంఖ్య ఆధారంగా కాకుండా బడిఈడు పిల్లల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేయాలని చెప్పారు. వాణిజ్యప్రాంతాల్లో ఉన్న స్కూళ్లను నివాస ప్రాంతాలకు తరలించవచ్చని వారు సూచించారు. యాజమాన్యాల సమ్మతితో ఎయిడెడ్ స్కూళ్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.