తెలంగాణ

ఎమ్మెల్యే తర్వాతే సిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: శాసన సభ్యుల ప్రోటోకాల్ విషయంలో అధికారులకు స్పష్టత ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని అధికారులకు లేఖ రాయనున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ‘ప్రోటోకాల్‌పై చాలామంది ఎమ్మెల్యేలకు కూడా తెలియకపోవచ్చు, సీనియర్లకు తెలిసి ఉండవచ్చు. ప్రోటోకాల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా ఎమ్మెల్యే పైస్థాయిలో ఉంటారు’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో వెల్లడించారు. ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించనున్నట్టు కెసిఆర్ తెలిపారు. స్పీకర్ సైతం ఈ అంశంపై అధికారులకు లేఖ రాయాలని కోరారు. ప్రోటోకాల్‌ను పాటించకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని, ప్రోటోకాల్‌ను పాటించని వారిపై డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలోని కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిస్థితిని అంతవరకు రానివ్వకుండా ప్రోటోకాల్‌ను అధికారులు తప్పని సరిగా పాటించాలని సూచించారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేకు కూడా చెప్పకుండా వారి నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మన ఎమ్మెల్యేలను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవమానించుకోవడం తగదని కెసిఆర్ అన్నారు. మంత్రులు నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ఆహ్వానించాలని, రావడం రాకపోవడమనేది వారి ఇష్టమని, అందరినీ మాత్రం ఆహ్వానించాలని సూచించారు. ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని పోవాలన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు క్రియాశీలక పాత్ర వహించాలని అన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం వల్ల విజయవంతమైందని అన్నారు. ప్రోటోకాల్ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, డిజిపి, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.
బాహుబలికి అభినందన
బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలో అభినందించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించినందున అభినందించాలని సిపిఐ ఎమ్మెల్యే లేఖ రాశారని ముఖ్యమంత్రి తెలిపారు.