తెలంగాణ

డిజిఎం అభ్యర్థుల జాబితా సిద్ధం: టిఎస్‌పిఎస్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయి, సివరేజ్ బోర్డు సర్వీస్‌లోకి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) తెలిపింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలను పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు గతేడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాతపరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి మార్చి 29న ఇంటర్వూను నిర్వహించి, ఆ వెంటనే ఎంపికైన జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 1నుంచి రామయ్య
కోచింగ్‌కు దరఖాస్తుల విక్రయం
హైదరాబాద్, మార్చి 29: రామయ్య ఐఐటి కోచింగ్ సెంటర్‌లో ప్రవేశానికి ఏప్రిల్ 1న దరఖాస్తులు విక్రయిస్తున్నట్లు రామయ్య విద్యాపీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ఉ. 8 నుంచి సా. 6 గం. వరకు దరఖాస్తులు పొందవచ్చని చుక్కా రామయ్య ఆ ప్రకటనలో తెలిపారు. ఒక్కరోజు మాత్రమే దరఖాస్తులు విక్రయించబడతాయని వెల్లడించారు.