తెలంగాణ

ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: మియాపూర్ భూకుంభకోణంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గవర్నర్‌ను కలిసి కోరారు. గురువారం ఇక్కడ సిఎల్‌పి నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తదితర కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ భూస్కాంలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కుటుంబానికి, సిఎంవో కార్యాలయానికి భూముల కుంభకోణంతో ప్రమేయం ఉందని ఆరోపణ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ తరహా స్కాంలు చోటు చేసుకోలేదన్నారు. మియాపూర్ స్కాం విలువ దాదాపు రూ.15వేల కోట్లని చెప్పారు. ప్రభుత్వ భూముల కొనుగోళ్లు, ఆక్రమణల్లో సిఎంవో పేషీలో ఉద్యోగులు, సిఎం బంధువులు ఉన్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు ఇబహ్రీంపట్నంలో భూములను వదులుకోవడం దేనికని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక మతలబు ఉందన్నారు. సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఎంపి కవిత ఏ హోదాలో పాల్గొన్నారన్నారు. దీనిపై అనేక సందేహాలు ఉన్నాయన్నారు. భూముల ఆక్రమణలపై గతంలో నియమించిన ఎస్‌కె సిన్హా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. సిఐడి పోలీసులకు ఈ కేసును అప్పగించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన భూ స్కాం వివరాలు, ఇందులో ప్రమేయం ఉన్న పెద్దల పేర్లతో తాము గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు.

చిత్రం.. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ