తెలంగాణ

నీళ్లునమిలేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఇంటింటికి మంచినీరు, గుంటగుంటకు సాగునీరు అందించితీరుతామని, తెలంగాణలో కరవు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై శాసన సభలో బుధవారం జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ కరవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా కరవు శాశ్వత పరిష్కారానికి అన్ని పక్షాల సభ్యులూ సహకరించాలని కోరారు. తెలంగాణలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి కోటి 57 లక్షల ఎకరాలుందని, దీనిలో సాగు అవుతున్నది కోటి 24లక్షల ఎకరాలన్నారు. 33లక్షల ఎకరాలు పడావ్ భూమి అని చెప్పారు. ఈ భూమిలో ఎలాంటి పంటలు వేయరు. ఇక సాగవుతున్న ఒక కోటి 24 లక్షల ఎకరాల్లో 50లక్షల ఎకరాలు మాత్రం బోర్ల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా సాగు అవుతోందని తెలిపారు. పడావ్ భూమి 33లక్షల ఎకరాలు, వర్షంపై ఆధారపడి పంటలు పండించే 66 లక్షల ఎకరాలు మొత్తం కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు. దీనిపై సమగ్ర వివరాలతో శాసన సభలో సిఎం గురువారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారని, ఏమైనా లోటు పాట్లు ఉన్నాయని సభ్యులు భావిస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. కరవుకు శాశ్వత పరిష్కారం చూపడంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని పోచారం కోరారు. గోదావరి, కృష్ణా నదుల్లో మన వాటా ఎంత? ఈ నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, బ్యారేజీలు ఎక్కడ అనేది ముఖ్యమంత్రి సభలో వివరిస్తారని చెప్పారు. దీనిలో పొరాపట్లు ఏమైనా ఉంటే సభ్యులు సరిదిద్దవచ్చునని అన్నారు. రాష్ట్రంలో 20లక్షల బోర్‌వెల్స్ ఉన్నాయని, కరవుతో ఎండిపోయాయని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే మూడు నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, రైతులు రెండు పంటలు పండించుకునే రోజులు రాబోతున్నాయని అన్నారు.
కరవు నివారణ బృందాలు
మండల స్థాయి అధికారులతో కరవు నివారణ, సహాయ కార్యక్రమాలు, తాగునీరు అందించడం కోసం బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ అధికారి, ఎండిఓ, వ్యవసాయ అధికారులు, అవసరం అయితే మండల ప్రజాపరిషత్తు అధికారుల బృందం ఏర్పాటు చేసి ఆయా మండలాల పరిధిలో కరవు నివారణ, మంచినీటి సౌకర్యాం కల్పించేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. పశువులు నీళ్లు తాగడానికి రాష్ట్రంలో 22వేల కొట్టాలు ఉన్నాయని, మరో 14 వందల కొట్టాలు నిర్మించనున్నట్టు చెప్పారు. మంచినీటి సమస్య తీర్చేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని, అవసరం అయితే మరో మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు. సహాయం కోసం కేంద్రంపై అందరం కలిసి ఒత్తిడి తీసుకు వద్దామని అన్నారు.
కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని స్వామినాథన్ కమీషన్ సిఫారసులు పూర్తిగా అమలు చేయాలని కేంద్రాన్ని ఇంతకు ముందే కోరినట్టు చెప్పారు. అదే విధంగా పంటల బీమా రైతులకు ఏ మాత్రం ఉపయోగరంగా లేదని, రైతు ఆధారంగా బీమా ఉండాలని అన్నారు. మండలం అధారంగా, గ్రామం ఆధారంగా బీమా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. ఇప్పటి వరకు రైతులు కట్టిన బీమా సొమ్ము కన్నా వారికి వచ్చింది తక్కువ అని పోచారం తెలిపారు. నిబంధనల మేరకు కరవు మండలాలు ప్రకటించినట్టు చెప్పారు. వ్యవసాయ బోర్లను కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో తాగునీరు అందిస్తున్నట్టు చెప్పారు.