తెలంగాణ

సిబిఐ విచారణ చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూన్ 17: రాజధానిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిబిఐచే విచారణ జరిపించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జెఎసి ఆధ్వర్యంలో ‘మియాపూర్ భూ కుంభకోణం’పై పలువురు సీనియర్ న్యాయ నిపుణుల సమక్షణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులచే సర్వే నిర్వహించిందని చెప్పారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా ఆ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గత పరచడంలేదని అన్నారు.
కోట్లాది రూపాయాలు ఆస్తులు కలిగిన వారే వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో నివసించే సాదారణ జీవులకు 80 గజాల స్థలం దొరకడం ఘగనమైందని అన్నారు. జాగీర్దర్ వ్యవస్థలోని పలు లోపాలను ఆసరాగా చేసుకొని ఎంతో మంది అక్రమార్కులు ప్రభుత్వ భూములను స్వాధీన పరుచుకుంటున్నారని వివరించారు.
కేవలం హైదరాబాద్ నగర పరిధిలోనే వేల ఎకరాల భూములు అన్యాయం అక్రాంతం అయినట్టు తెలుస్తుంటే ప్రభుత్వం మాత్రం ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాలేదని ప్రకటించడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఇలాంటి తరహా ప్రకటనల వల్ల ప్రభుత్వం కబ్జాదారుల పక్షాన ఉన్నదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో నిర్వహించిన భూ సర్వే నివేదికను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించక పోతే జెఎసి ఆధ్వర్యంలో నిపుణుల సహాయంతో పీపుల్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తామే ప్రజా విచారణ జరుపుతామని అన్నారు. ఈ సమావేశంలో రాజకీయ జెఎసి ప్రతినిధులు విద్యావెంకట్, సత్యం, సమాచార హక్కు కార్యకర్త సురేష్, సిపిఎం నాయకులు శోభన్, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న జెఎసి చైర్మన్ కోదండరామ్