రాష్ట్రీయం

ఆంధ్ర వల్లనే హైకోర్టు విభజన ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18:ఆంధ్రప్రదేశ్ వైఖరి వల్లనే హైకోర్టు విభజన ఆలస్యం అవుతోందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్లు గడిచి పోయాయి, ఇంకా ఉమ్మడి హైకోర్టు కొనసాగుతోందని, వెంటనే హైకోర్టును విభజించాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరిని కోరారు. హరిత ప్లాజాలో కేంద్ర మంత్రిని ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం కలిశారు. హైకోర్టు విభజనకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు.
హైకోర్టు విభజనను కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు చెప్పా రు. విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ఆధారంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఎపిలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టును తక్షణమే విభజించాలని, దీనికి అవసరం అయిన భవనాలను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి, కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకు వెళ్లాలని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన తరువాత ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విధుల నిర్వహణకు అనువైన భవనాన్ని కేటాయించిన వెంటనే అక్కడ హైకోర్టును ఏర్పాటు చేసుకోవచ్చునని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే హైకోర్టు భవన నిర్మాణ విషయంలో ఆలస్యం చేస్తోందని తెలిపారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టుగానే హైకోర్టు భవనం నిర్మిస్తే హైకోర్టు విభజన సులభతరం అవుతుందని అన్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్నందు వల్ల విభజన చట్టం ప్రకారం న్యాయాధికారుల విభజన చేయాలని, న్యాయశాఖ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి 42శాతం రేషియో పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ సహాయ మంత్రిని కోరినట్టు చెప్పారు. కింది కోర్టుల్లో జడ్జీల విభజన జరగలేదని చెప్పారు. అదే విధంగా న్యాయశాఖలో ఖాళీల భర్తీకి కేంద్రం చొరవ తీసుకోవాలని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టుల భవన నిర్మాణాల కోసం సెంట్రల్ స్పాన్సర్ స్కీం కింద నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో న్యాయశాఖ సెక్రటరీ రామాంజనేయులు, తెలంగాణ న్యాయవాదులు జెఎసి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి ఉన్నారు.