తెలంగాణ

ఆత్మహత్య చేసుకున్న 419 మంది రైతులకు రూ. 6 లక్షల చొప్పున నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 419 మంది రైతులకు రూ. 6లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. బుధవారం అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998 నుంచి 2014 వరకు 34073 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణలో 7304 మంది రైతులు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. ఆత్మహత్యలు నిరోధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం చేయని మంచి పని చేశామన్నారు. 2010-13 సంవత్సరాలకు 21560 మంది రైతులకు 16374 హెక్టార్లలో పంట నష్టం జరిగినందుకు 21.70 లక్షల నగదు పంపిణీని నష్టపరిహారంగా ఇచ్చామన్నారు. 2014 మార్చి లో 56వేల మంది రైతులకు రూ. 23 కోట్లను పంపిణీ చేశామన్నారు.

మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు
గ్రేటర్‌కు రూ. 60కోట్లు: కెటిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: ఈ వేసవిలో మంచినీట్టి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. శాసనసభలో బుధవారం కరువు పరిస్థితులపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మంచినీట్టి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఏప్రిల్, మే నెలలో ఈ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే మంచినీటి ఎద్దడిని తీర్చడానికి 9 జిల్లాలకు రూ. 329 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి ఎద్దడి నివారణ కోసం మరో రూ. 60 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులు జిల్లాలకు వెళ్లి మంచినీటి ఎద్దడి నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి గుర్తు చేశారు.