తెలంగాణ

ఐదేళ్లలో 35 లక్షల రిజిస్ట్రేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న కేసులు కుకుట్‌పల్లి, బాలానగర్, మేడ్చెల్ సబ్ రిజిస్ట్రేషన్లకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు మొత్తం 183 కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 శాతం కేసులో పాత రంగారెడ్డి జిల్లాలో ఉండడం విశేషం. 2013లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అవకతవకలు మొదటి నుంచి ఉన్నాయి. దాదాపు 183 కేసులు రిజిస్ట్రేషన్ శాఖ దృష్టికి వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించింది. రాష్ట్రంలో 2013 నుంచి ఇంతవరకు అన్ని జిల్లాల్లో 35 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఐదు లక్షల రిజిస్ట్రేషన్లు ఎనీవేర్ విధానంలో జరిగాయి. ఎనీ వేర్ కింద గరిష్ట స్ధాయిలో దాదాపు 1.98 లక్షల రిజిస్ట్రేషన్లు పాత రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి.
సాధారణ రిజిస్ట్రేషన్లు రంగారెడ్డి జిల్లాలో 11.15 లక్షలు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు 1.98 లక్షలు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1.72 లక్షలు, నల్లగొండ జిల్లాలో 4.92 లక్షలు, హైదరాబాద్‌లో 2.4 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 3.36 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.18 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 5.2 లక్షలు, మెదక్‌లో 2.8 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 2.45 లక్షలు, వరంగల్‌లో 2.5 లక్షల సాధారణ రిజిస్ట్రేషన్లు జరిగా యి. కనిష్ట స్ధాయిలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఆదిలాబాద్‌లో 4720, నిజామాబాద్‌లో ఆరు వేలు, జరిగాయి.