తెలంగాణ

విమానంలో వ్యక్తి వికృత చేష్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విమానం టేకాఫ్ అయిన అర గంటలో హస్తప్రయోగం చేసిన 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఆ మహిళ సదరు వ్యక్తి పక్క సీటులో కూర్చుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి విమానంలో తన ఫ్యాంట్ జిప్ తీసి హస్తప్రయోగం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అప్పుడు తాను ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకు వెళ్లానని, దీంతో ఆమె వెంటనే తన సీటును మార్చిందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానం ఢిల్లీలో దిగగానే ఇండిగో సెక్యూరిటీ అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతణ్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించగా అతనిపై ఐపిసి 509, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.