తెలంగాణ

బాబు కొట్టిన దెబ్బకు నా తొడ వాచిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో తాను నిజాం సుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయవద్దని కోరినందుకు తన తొడ మీద గట్టిగా కొట్టారని, దీని వల్ల తొడ ఎర్రగా వాచిందని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం అసెంబ్లీలో సంచల వ్యాఖ్యలు చేశారు. సభలో కరవుపై చర్చ జరుగుతున్న సందర్భంగా పోచారం జోక్యం చేసుకుని మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు అలజడి నెలకొంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో మంత్రి పోచారం మంత్రిగా ఉన్న విషయం విదితమే. నిజాం సుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసే విషయమై ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశానికి హాజరైన తాను చంద్రబాబును నిజాం సుగర్స్‌ను ప్రైవేట్‌పరం చేయవద్దని రెండు చేతులతో ప్రార్ధించానన్నారు. దీంతో పక్కనే ఉన్న చంద్రబాబు తన తొడపై గట్టిగా చరిచి కొట్టారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గట్టిగా తగిలిందా అని అడిగారన్నారు. తనకు తొడపై తగిలిన దెబ్బకంటే గుండెపైన ఎక్కువ దెబ్బతగిలింది అంటూ గుండె చూపించానన్నారు. ఈ విషయాన్ని తాను ఎక్కడా ఇంతకాలం బహిర్గతం చేయలేదన్నారు. పోచారం వ్యాఖ్యలపై టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు చంద్రబాబు తొడపై కొట్టినట్లు ఈ రోజు చెబుతున్నారని, ఈ రోజు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొడుతున్న దెబ్బల గురించి రానున్న రోజుల్లో చెబుతారా అని విమర్శించారు. ఆ సమయంలో సభలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ చంద్రబాబు కొట్టినా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. దీనికి మంత్రి పోచారం బదులిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణలో ఒక్క రూపాయి ఇచ్చేది లేదని సభలో మాట్లాడితే, మంత్రి పదవిలో ఉన్న మీరు ఎందుకు రాజీనామా చేయలేదని సవాలు విసిరారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో అలజడి నెలకొనడంతో స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.