తెలంగాణ

చేసింది తక్కువ...మార్కెటింగ్ ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఏమీ చేయకపోయినా, ప్రచార ఆర్భాటం అధికంగా ఉండేదని కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మకమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన బిజెపి అడ్వకేట్స్ విభాగాన్ని కోరారు. బిజెపి అడ్వకేట్స్ విభాగం అధ్యక్షుడు విశ్వనాథ్ అధ్యక్షతన ఆదివారం నగరంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో కేంద్ర మంత్రి పిపి చౌదరి ప్రసంగిస్తూ యుపిఎ అవినీతి పాలన అంటూ తూర్పారపట్టారు. ప్రధాని మోదీ పాలనలో అవినీతి లేదని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారన్న సామెతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. 60 ఏళ్ళలో కాంగ్రెస్ చేయలేని పనులను మూడేళ్ళలో చేసి చూపిస్తున్నామని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వచ్చిందని, అవినీతి తగ్గిందని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా గురించి ఆయన ప్రస్తావిస్తూ రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీల్లో వైఫై సేవలందించనున్నట్లు తెలిపారు.
మండలాల్లో అడ్వకేట్స్ కమిటీలు: డాక్టర్ లక్ష్మణ్ సూచన
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ రాష్ట్ర పార్టీకి అనుబంధంగా ఉన్న అడ్వకేట్స్ కమిటీని కింది స్థాయి వరకూ తీసుకెళ్లాలని సూచించారు. మండల, పోలింగ్ కేంద్రాల స్థాయిలోనూ అడ్వకేట్స్ కమిటీలను నియమించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నదని విమర్శించారు. హక్కుల కోసం మళ్ళీ ఉద్యమించాల్సి ఉందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనను ఆయన తూర్పారపట్టారు. ప్రజా సమస్యలపై న్యాయవాదులు పోరాటం చేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేయరని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ భూ కుంభకోణాలపై పార్టీ అడ్వకేట్స్ కమిటీ పోరాటం చేయాలని కోరారు.

చిత్రం.. బిజెపి న్యాయవాదులనుద్ధేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి పిపి చౌదరి