తెలంగాణ

అవయవ మార్పిడులకు ఆరోగ్యశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18:అవయవ మార్పిడులు చేసుకున్న రోగులందరికీ దీర్ఘకాలికంగా లైఫ్ టైమ్ ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని, అలాంటి లైఫ్ సేవింగ్ మెడిసిన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న రోగులకు ఈ నిధుల నుంచి మందులు పంపిణీ చేస్తారు.
పేదల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గ్లోబల్ ఆస్పత్రిలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన నలుగురు పేషంట్లను మంత్రి పరామర్శించారు. ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే ప్యాకేజీలోనే ప్రైవేట్ ఆస్పత్రులు ఈ అవయవ మార్పిడులు చేయడం మంచి పరిణామం అని అన్నారు. అవయవ మార్పిడులకు కొంత వ్యయం అవుతున్నా, తమ లాభాలను తగ్గించుకోవడమే కాకుండా కొంత సేవా దృక్ఫథంతో ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు వచ్చి నిరుపేదల ఆరోగ్య సౌభాగ్యంలో మేము సైతం అంటూ ప్రభుత్వానికి సహకరించడం సంతోషదాయకమని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ల కోసం ఆపరేషన్ థియోటర్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకున్న రోగులకు ఆపరేషన్ తరువాత కూడా ఉచితంగా మందులను ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సహాయంతో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఎర్ర సుందర్‌రాజ్, ఖమ్మంకు చెందిన లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్‌కు చెందిన సుశీల, నిజామాబాద్‌కు చెందిన కస్తూరి మోహన్‌లను మంత్రి పరామర్శించారు. చికిత్స పొందు తున్న పేషెంట్లు మంత్రితో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంను కెసిఆర్‌ను, లక్ష్మారెడ్డిని కొనియాడారు. సిఎం కెసిఆర్ తమకు పునర్జన్మ అందించారని అన్నారు. మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ చంద్రశేఖర్, ఆస్పత్రి ఎండి రవీంద్రనాథ్, వైద్యులు, అధికారులు ఉన్నారు.