తెలంగాణ

మైనార్టీల విద్యావికాసానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ముస్లిం, మైనార్టీల విద్యా వికాసానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చా రు. హైదరాబాద్ నాంపల్లిలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించే ముస్లిం ఆనాధ పిల్లలకు ఆశ్రయం, విద్యా అందించడానికి నిర్మిస్తున్న అనీస్-ఉల్-గుర్బాకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అనీస్-ఉల్-గుర్బాకు నూతన భవనాన్ని గొప్పంగా నిర్మిస్తామన్నారు. కొత్త భవనాన్ని ఏడు అంతస్తులతో లక్ష 53 వేల చదరపు అడుగుల విస్థీర్ణంతో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని అన్నారు. మొదటి రెండు అంతస్తులో వాణిజ్య సముదాయానికి కేటాయించి, మిగిలిన ఐదు అంతస్తులను ఆనాధ పిల్లల కోసం కేటాయిస్తామన్నారు. ఇందులో ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే 500 మంది విద్యార్థులకు ఆశ్ర యం కల్పిస్తామన్నారు. ఇక్కడ చదువుకునే పిల్లలు వారు జీవితంలో స్థిరపడే వరకు ఇక్కడే వసతి పొందవచ్చన్నారు. హైదరాబాద్ నగరంలో 60 మంది అనాధ ముస్లిం పిల్లలకు ఆశ్ర యం కల్పించడాని 1921లో నిజాం నవాబు ఆనీస్-ఉల్-గుర్బా ఏర్పాటు చేశారన్నారు. రోడ్ల వెడల్పు సందర్భంగా ఇటీవల దీనికి సంబంధించిన 191 గజాల స్థలం పోయిందన్నారు. పోయిన స్థలానికి బదులుగా 4 వేల గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 20 కోట్లతో కొత్త భవనం నిర్మించి ఇస్తున్నామన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం, మైనార్టీల కోసం రాష్ట్రంలో కొత్తగా 204 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అనీస్-ఉల్-గుర్బా భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందలు తెలిపారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దిన్ ఒవైసీ, పలువురు మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం.. అనీస్-ఉల్-గుర్బాకు ఆదివారం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్