తెలంగాణ

ముత్తూట్ ఫైనాన్స్ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. హైదరాబాద్ నగరశివారులోని రామంచంద్రాపురంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు విచారణ ఎదుర్కొంటుండగా తాజాగా ముంబయి పోలీసులు మరో ఇద్దరు సురేందర్, అతని భార్య రాధారత్నంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా వీరిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో సిబిఐ అధికారులమంటూ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి ఆరుగురు వ్యక్తులు అక్కడున్న సిబ్బందిని బెదిరించి సుమారు ఎనిమిది కోట్ల విలువైన 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. కాగా నాటి నుంచి ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ముంబయిలో వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులు చిక్కారు. దీంతో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు ఓ కొలిక్కి వచ్చింది.
ముత్తూట్ దోపిడీ తీరిది..
హైదరాబాద్ శివారు రామచంద్రాపురం-బీరంగూడ రహదారికి ఆనుకుని ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం అది. డిసెంబర్ 2016..ఉ.గం. 9:15 అవుతుంది. ఆ సమయంలో మేనేజర్ వెంకట్‌రెడ్డి, సిబ్బంది రామకృష్ణ, అశోక్, శాంతమ్మ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వాచ్‌మెన్ దేవదాస్ వద్దకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. తాము ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులమని చెప్పారు. వారితోపాటు ఓ ముసుగు ధరించివున్న వ్యత్తిని చూపెట్టి..ఈ వ్యక్తి దొంగతనం చేసిన సొత్తును మీ ఫైనాన్స్‌లో పెట్టాడని, విచారించాలంటూ..లోని చొరబడుతుండగా వారిని వాచ్‌మెన్ అడ్డుకుంటుండగా అతణ్ని తోసేసి, అందరి ఫోన్లు పక్కన పెట్టాలని లేకుంటే కాల్చేస్తామని తుపాకీతో బెదిరించారు. లాకర్లను తెరిపించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు నెలల్లో నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. దుండగులు కర్నాటకలోని కలబురగికి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ప్రధాన నిందితులైన సుందర్, రాధారరత్నాన్ని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కాగా వీరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తరువాత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.