తెలంగాణ

హైదరాబాద్‌లో వచ్చే ఏడాది జాతీయ సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: మరో భారీ సమ్మేళనానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ హైదరాబాద్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ సమ్మేళనానికి 15వేల మంది శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలు ప్రత్యేక ప్రతినిధులు, పరిశోధకులు హాజరుకానున్నారు. ఈసారి సైన్స్ కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున నోబెల్ గ్రహీతలు కూడా పాల్గొంటారని సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ ప్రత్యేక కార్యాలయాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం సోమవారం నాడు ప్రారంభించారు. సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్, కమ్యూనికేటర్స్ మీట్, ప్రదర్శనలు, ఇతర సెమినార్‌లు జరుగుతాయని విసి చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ పార్థసారథి, ప్రొఫెసర్ రెడ్యానాయక్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శంకర్, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.