తెలంగాణ

మరో 34 గోదాములకు నాబార్డ్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణలో కోటి ఎకరాలకు సాగులోకి తెచ్చే ప్రయత్నం ఒకవైపు సాగుతుండగా, దానికి తగినట్టు గోదాముల నిర్మాణం చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ తెలిపింది. 74 కోట్ల రూపాయల నాబార్డ్ సహాయంతో మరో 34 గోదాములను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిషన్ కాకతీయ వంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, సాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి వల్ల ఖరీఫ్, యాసంగి సీజన్‌లో అంచనాలకు మించి అనూహ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పంట చేతికి వస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ గోదాముల వసతి సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేవలం 174 గోదాములు ఉండేవని, వాటి సామర్ధ్యం 4లక్షల 17వేల 500 మెట్రిక్ టన్నులు, కాగా తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 17లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 355 గోదాముల నిర్మాణం చేపట్టింది. వీటికి తోడు అదనంగా మరో 34 గోదాముల నిర్మాణానికి నాబార్డ్ సోమవారం 74 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 34 గోదాముల సామర్ధ్యం లక్షా 22వేల 500 మెట్రిక్ టన్నులు. దీంతో మొత్తం గోదాముల సామర్ధ్యం దాదాపు 23 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని మార్కెటింగ్ శాఖ తెలిపింది.