తెలంగాణ

సిద్ధిపేట మెడికల్ కాలేజీకి సెమీ అటానమస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: కొత్తగా ఏర్పాటు చేసిన సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇచ్చారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇవ్వాలంటూ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి 2017 ఏప్రిల్ 20 న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వద్ద జరిగిన చర్చల్లో సిద్ధిపేట మెడికల్ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా తాజాగా జీఓ జారీ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సెమీ-అటానమస్ హోదా లభించిన కాలేజీల్లో సిద్ధిపేట కాలేజీ రెండోది అవుతుంది. ఇంతకు ముందు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణలోని పాత జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.