తెలంగాణ

గాంధీభవన్‌లో రాహుల్ జన్మదిన వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను టిపిసిసి ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, పార్టీ సీనియర్ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే, ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేశారని అన్నారు. సిఎం కెసిఆర్ మాత్రం తన కుటుంబ స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. దళితుడిని సిఎంను చేస్తానని చెప్పి ఆ హామీని గాలికొదిలేశారని ఆయన అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో అట్టహాసంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి పొన్నాల, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు హాజరయ్యారు. గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.