తెలంగాణ

భోజనం వికటించి ట్రైనీ కానిస్టేబుళ్ళకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 19: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 37 మంది కానిస్టేబుళ్ళు భోజనం వికటించి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన అలజడి సృష్టించింది. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ సీరియస్‌గా స్పందించి, మెస్ ఇన్‌చార్జిని విధుల నుండి తొలగించగా జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఇటీవల రిక్రూట్ అయిన హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన 240 మంది కానిస్టేబుళ్ళకు గత 50 రోజులుగా విధి నిర్వహణపై శిక్షణ ఇస్తుండగా ఆదివారం మధ్యాహ్నం చికెన్ భోజనం తిన్న తర్వాత రాత్రి బెండకాయ, పప్పు పులుసు భోజనం ఆరగించారు. అయితే రాత్రి నుండి కడుపులో తిప్పుతూ కొందరు కానిస్టేబుళ్ళు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం రోల్‌కాల్ అనంతరం వ్యాయామ శిక్షణలో భాగంగా పరుగులు తీస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్ళు తీవ్ర నీరసంతో కిందపడిపోయారు. మరికొంతమంది కానిస్టేబుళ్ళు శిక్షణ నుండి పరుగున వచ్చి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ముందుగా ఇద్దరు కానిస్టేబుళ్ళను రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం తర్వాత మరికొంతమంది కానిస్టేబుళ్ళు అస్వస్థతతో రిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికెన్ భోజనం వికటించడం వల్లే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యామని, గతంలో అన్నంలో సైతం పురుగులు వచ్చాయని, ఆహారం సరిగ్గా పెట్టడం లేదని పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత కానిస్టేబుళ్ళు పేర్కొన్నారు. మొత్తం 37 మంది కానిస్టేబుళ్ళు వాంతులు, విరేచనాలతో మంచం పట్టి చికిత్స పొందగా జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, పోలీసు శిక్షణ కేంద్రం డిఎస్పీ సీతారాములు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మధ్యాహ్న భోజనం ప్రభావంగా అస్వస్థతకు గురయ్యారా కలుషిత నీరు తాగడం వల్లనే ఆసుపత్రి పాలయ్యారా అన్న విషయంపై ఆరా తీశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్‌ను, ఇంచార్జిను విధుల నుండి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 37 మంది ట్రైనీ కానిస్టేబుళ్ళు అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని డిటిసి డిఎస్పీని ఆదేశించారు. కాగా, సాయంత్రం వరకు 20 మంది కానిస్టేబుళ్ళు కోలుకొని తిరిగి శిక్షణ కేంద్రానికి తరలివెళ్ళారు. పరిస్థితి అదుపులోనే ఉందని, అందరు క్రమంగా కోలుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ అశోక్ తెలిపారు.