తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, జూన్ 19: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని వెలగొండ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... వీపనగండ్ల గ్రామం నుంచి విద్యుత్ స్తంభాలు తీసుకొని వెలగొండ గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెలగొండ గ్రామానికి చెందిన బోయ చిన్న రాములు (50), గొల్ల ముష్టి రాములు (45), బెక్కెం ఉశన్న (38) అక్కడికక్కడే మృతి చెందారు. బోయ కురుమయ్య తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ భీసన్న పరారీలో ఉన్నారు. ఈ సంఘటన స్థలాన్ని ఎంపిపి లావణ్య, జడ్పీటిసి లోకారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎస్‌ఐలు తిరుపాజీ, సాయిచంద్ర ప్రసాద్ క్రేన్ సహకారంతో సహయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వెలగొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.