తెలంగాణ

అభివృద్ధి పథంలో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూన్ 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేసారు. బడుగు బలహీనవర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జిఎంఆర్ ఫంక్షన్‌హాలులో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్‌లను పంపిణీ చేసారు. తదనంతరం వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో హాజరైన గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కేవలం మూడేళ్లయనప్పటికీ వినూత్న పథకాలను అమలు చేయడం ద్వారా భారతావనిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. యాభై సంవత్సరాలుగా రహదారుల, బ్రిడ్జిల నిర్మాణాలను గాలికి వదిలేసారన్నారు. రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వార రాష్ట్భ్రావృద్ధి వేగవంతం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌అండ్‌బి శాఖ ద్వారా వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించారన్నారు. అన్ని వర్గాలకు సమానన్యాయం అందిస్తున్న ప్రభుత్వం షాదీముబారక్ పేరిట మైనారిటీలకు, కల్యాణలక్ష్మి ద్వారా బలహీనవర్గాలకు వారి పిల్లల వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ వివాహ సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి పలు పధకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పేరిట నియోజకవర్గ పరిధిలోని వందలాది మందికి సహాయ సహకారాలు అందించిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అనేక నూతన పథకాలను ఆవిష్కరించిందన్నారు. తక్కువ సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా 2018 సంవత్సరం డిసెంబర్‌లోగా ఇంటింటికి మంచినీరు అందించడం ఖాయమని ఆయన విశ్వాసం వె లిబుచ్చారు.