తెలంగాణ

రాష్ట్రంలో కేంద్ర పథకాల నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 19: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తోందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి పట్టుగొమ్మ అయిన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, రైతులను అప్పులపాలు చేస్తోందని విమర్శించారు. రెండు దశాబ్దాల నుంచి నాటి కాంగ్రెస్ పాలకుల తీరుతో జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 3 లక్షలకుపైగా రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి, రైతు సంక్షేమంపై దృష్టి సారించిందని తెలిపారు. ఈక్రమంలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేశారని అన్నారు. దీనిని రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసి, రైతుల ద్వారా వారి పంటలకు బీమా ఏర్పాట్లు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఫలితంగా 55 లక్షలకుపైగా రైతులున్న తెలంగాణలో కేవలం 6 లక్షలపైచిలుకు అన్నదాతలు మాత్రమే బీమా సౌకర్యం పొందారని తెలిపారు.
కేంద్రం చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో బిజెపి బలపడితే, తమకు పుట్టగతులుండవనే భయంతోనే కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. ఢిల్లీ నిధులు పక్కదారి పట్టిస్తూ ప్రాజెక్టుల పేర దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఫలితంగా అన్నదాతలు ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతున్నారని, వీటిని అరికట్టే క్రమంలో కర్షకుల ఎజెండానే తమ ఎజెండాగా చేసుకుని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కిసాన్‌మోర్చా సన్నాహాలు చేస్తోందన్నారు. 2020 వరకు రైతు ఆదాయం రెట్టింపుచేసే దిశగా తగిన ప్రణాళికలు రూపొందించి, అందుకనుగుణంగా పంటల ధరలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి రాష్ట్రంలో బలోపేతమవుతుందని, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిసారిగా తెలంగాణలో జెండా ఎగరేసేందుకు క్షేత్రస్థాయి నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వరుసగా మూడోసారి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను ఎన్నికవడంలో సహకరించిన జాతీయ నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాషవేని మల్లేశం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండ్యాల సాయికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.