తెలంగాణ

పేదలకు వైద్య సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జూన్ 19: పేదలకు ఉచిత వైద్యసేవలు విస్తృతం చేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన టికెవి.రంగాచార్యాలు, రంగనాయకమ్మ లయన్ కంటి ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్ర దానం మహాదానమని, కంటిచూపు లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని , అందువల్ల పేద ప్రజలకు ఉచిత నేత్ర చికిత్సను అందించాలని సూచించారు. దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు సహకారం అందివ్వాలని ఆయన అన్నారు.
ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రంగాచార్యులు ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందించాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం 1000 మందికి ఉచితంగా తనవంతుగా కళ్ల అద్దాలను అందిస్తానని, అందుకుగాను ఆరేళ్లకు ఒకసారి ఉచిత నేత్ర వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం తనవంతు సహాయ, సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ మిర్యాలగూడలో నిర్మించిన కంటి ఆసుపత్రిని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలని అన్నారు. పేదలకు నేత్ర వైద్యం అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రూ.2 కోట్ల విలువైన స్థలం రంగాచార్యులు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా దానం చేయడం అభినందనీయమని, ఆయన ఏ ఆశయంతో అయితే స్థలాన్ని దానం చేశారో ఆయన ఆశయాలు నెరవేరే విధంగా ఆసుపత్రిని నడిపించాలని ఆయన అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యానాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ రామానుజాచార్యులు, ట్రస్ట్ చైర్మన్ కొల్లి ప్రభాకర్‌రావు, ట్రస్ట్ సభ్యుడు ముక్కపాటి వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ రాజు, లయన్స్ మురళీ కృష్ణ, చంద్రశేఖర్‌శెట్టి, పిఎస్.బన్సాల్, నేతి రఘుపతి, మోహన్‌రావు, డాక్టర్ పుల్లారావు, మామిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కెఎన్.ప్రసాద్, కర్నాటి రమేశ్, ఎంపిపి జానయ్య, శివప్రసాద్, స్థల దాత రంగాచార్యులు కుమార్తెలు సీత, కస్తూరి, కౌన్సిలర్లు తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.