తెలంగాణ

డిగ్రీకి నాలుగోదశ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా ఆన్‌లైన్ అడ్మిషన్లను ప్రారంభించినా, విద్యార్థుల నుండి అనుకున్నంత సానుకూలత రాకపోవడం, వెబ్ ఆప్షన్లకు వచ్చినా, కాలేజీల్లో సీటు కేటాయింపు అనంతరం కనీసం 30 శాతం మంది కూడా రిపోర్టు చేయకపోవడం మరో పక్క ప్రసిద్ధి చెందిన కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎంతో చిత్తశుద్ధితో ప్రారంభించిన ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ(దోస్త్) వివాదాల్లో చిక్కుకుంది. దీనికి తోడు యాజమాన్యాలు ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అడ్మిషన్ల ఖరారును రెండు వారాల పాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు స్టే విధించడం కూడా ఆటంకంగా తయారైంది. దీంతో భవిష్యత్ కర్తవ్యంపై ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం నాడు చర్చించారు. ఇప్పటికే డిగ్రీ తొలి దశ అడ్మిషన్లు పూర్తి చేశామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం పేర్కొన్నారు.
రెండు, మూడు దశల్లో కూడా అడ్మిషన్లు చేస్తామని, ఇంజనీరింగ్‌లో సీటు రాకుండా డిగ్రీ చేయాలనుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కూడా దృష్టిలో ఉంచుకుంటామని, వారికోసం అవసరమైతే మూడో దశ ముగిసిన తర్వాత మరో విడత అడ్మిషన్లు చేస్తామని పేర్కొన్నారు. దోస్త్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని కూడా అధిగమిస్తామని చెప్పారు. గత ఏడాది మాదిరి లోపాలు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. 1089 కాలేజీల్లో 4,10,047 సీట్లు ఉండగా అందులో తొలి దశలో 1,40,033 సీట్లను తొలి దశలో భర్తీ చేశారు. ఉస్మానియా పరిధిలో 57,950, కాకతీయ పరిధిలో 34,812, మహాత్మాగాంధీ పరిధిలో 10,547, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 10303, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 16407, పాలమూరు వర్సిటీ పరిధిలో 10,014 సీట్లు భర్తీ చేయనున్నారు.
అయితే ఇంత వరకూ దాదాపు 25 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. ఉస్మానియా పరిధిలోనే 1,42,860 సీట్లు ఉండగా రాష్టవ్య్రాప్తంగా భర్తీ అయిన సీట్లు 1.40 లక్షలు మాత్రమే. అయితే ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు జరిగినా విద్యార్థులు మాత్రం పెద్దగా ఆయా కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయలేదు. దానికి కారణం ఇటు ఇంజనీరింగ్ అటు డిగ్రీ కోర్సుల్లో రెండింటికీ అభ్యర్థులు దరఖాస్తు చేయడమే. ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఇంకా జరుగకపోవడంతో, ఆ వ్యవహారం తేలిన తర్వాతనే డిగ్రీలో చేరేది లేనిదీ ఈ విద్యార్థులు తేల్చుకోనున్నట్టు సమాచారం.