తెలంగాణ

రేపు చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రాష్టప్రతి పదవికి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని తాము అంగీకరించేది లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ పేరు ప్రకటించడానికి ముందు తమను సంప్రదించలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. రాష్టప్రతి అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న అంశంపై ఎన్డీఏ త్రిసభ్య కమిటీ తమను సంప్రదించినప్పుడు గోపాలకృష్ణ గాంధీ పేరును సూచించామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రతిపక్షాల తరఫున పోటీ చేసే అంశంపైనా, అభ్యర్థి ఎంపికపైనా ఈ నెల 22న జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గోరక్షక దళాల పేరిట దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుపిలో దళిత వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకుడు డాక్టర్ కె. నారాయణ కూడా పాల్గొన్నారు.