తెలంగాణ

రిజర్వేషన్లు వద్దన్న రామ్‌నాథ్ కోవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఇస్లాం, క్రిస్టియన్లు మన దేశానికి బయటి నుంచి వచ్చారు కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వరాదని రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ లోగడ అన్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ రిజర్వేషన్లపై నివేదిక సమర్పించిన సమయం (2010)లో బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్ ఈ విధంగా వ్యాఖ్యానించారని శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అటువంటి వ్యక్తి రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీకి దిగితే, సిఎం కెసిఆర్ మద్దతునివ్వడాన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు.
వ్యవసాయ ప్రణాళిక ఏది
ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం దురదృష్టరమని అన్నారు. బ్యాంకులు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని, గడ్డకట్టిన యూరియాను ఎక్కువ ధరలకు మార్క్‌ఫెడ్ రైతులకు అంటగడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.